గ్రామాల్లో బీఆర్ఎస్ సమర భేరి
ఉట్నూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలనలో విప్లమైందని ఉట్నూర్ మండల మాజీ ఎంపీపీ పంద్రజవంతరావు(Former MPP Pandrajavantha Rao) అన్నారు. బిఆర్ఎస్ పిలుపుమేరకు కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో సమరభేరి కార్యక్రమాలను నిర్వహించారు. బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి, కొలంగూడలో కళ్యాణ లక్ష్మి షాదీముబారక్. వృద్ధుల పింఛన్, వికలాంగుల పింఛన్, మహిళలకు 2500 ఈ పతకాల ఇవ్వడం లొ విఫలం పై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ నాయకులు ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి,కొలంగూడ లో బి ఆర్ఎస్ నాయకుల ఆందోళన చేపట్టారు. కార్యక్రమం లో జైవంత్ రావ్ మాట్లాడుతూ అధికారం వచ్చి 1000 రోజులు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు మోసపు వాగ్దానాలు ఇస్తా ప్రజలకు మభ్య పెడుతూ ఇంకేన్ని రోజులు మోసం చేస్తారని అని విమర్శించారు.






