పోలీస్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

27-11-2026 | 09:24am

ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాకీ యూనిఫాం ధరించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు(Unemployed youth) ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలీస్ శాఖలో భారీ Recruitment ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎస్సై, కానిస్టేబుల్ సహా వివిధ విభాగాల్లో మొత్తం 1,534 పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా ఈ నియామకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ Notificationలో 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు, 1,156 కానిస్టేబుల్ తదితర పోస్టులు ఉన్నాయి. ఎస్సై విభాగంలో సివిల్ (పురుషులు, మహిళలు) పోస్టులు 253, ఏఆర్ రిజర్వ్ ఎస్సై 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లో 9 ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్ కానిస్టేబుళ్లు 542, ఏఆర్ కానిస్టేబుళ్లు 285 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు Fire Departmentలో 158 ఫైర్‌మెన్, జైళ్ల శాఖలో 150 పురుష వార్డర్లు, 21 మహిళా వార్డర్ల పోస్టులకు కూడా ఎంపిక చేపట్టనున్నారు.

అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 27 సాయంత్రం 5 గంటల నుంచి Application Process ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పరిశీలించి అప్లై చేసుకోవాలి. మరోవైపు పరీక్షల తేదీలను కూడా Recruitment Board ప్రకటించింది. కానిస్టేబుల్ పోస్టులకు Preliminary Exam 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఎస్సై పోస్టుల Written Exam ఫిబ్రవరి 28న జరగనుంది. ఇందులో పేపర్-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. కమ్యూనికేషన్ ఎస్సై, పీటీవో, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రైవర్ వంటి ఇతర పోస్టుల దరఖాస్తుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

మరిన్ని వార్తలు