ఇక గజగజ వణుకుడే
హైదరాబాద్: నగరాన్ని తడిపిన వానలకు త్వరలోనే బ్రేక్ పడనుంది.. కానీ ఆ తర్వాత చలి పంజా విసరబోతోంది! బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత భాగ్యనగరాన్ని వర్షం పలకరించింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టడంతో కొన్ని కాలనీల్లో రోడ్లపైకి నీరు చేరింది. ఇటీవల వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటడం, తాగునీటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో తాజా Rain నగరవాసులకు కొంత ఊరటనిచ్చింది.
నవంబర్ 27 Weather Forecast ప్రకారం హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రానున్న 1–2 గంటల్లో క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. ఆ తర్వాత సాయంత్రం వేళ అక్కడక్కడా చినుకులు పడే అవకాశం మినహా ఎక్కువగా Dry Weather కొనసాగనుంది. ఉదయం 6.30 గంటల Rain Update ప్రకారం పటాన్చెరు, ఆర్సీపురం, అమీన్పూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, మాదాపూర్, బాలానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, షేక్‌పేట ప్రాంతాల్లో మరో 1–2 గంటల పాటు అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో Light Rain పడవచ్చని అంచనా. మరోవైపు నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా లేదా చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణమే ఉండనుంది. నవంబర్ 28 నుంచి తెలంగాణలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని Forecast చెబుతోంది.
వానలు తగ్గిన వెంటనే చలి తీవ్రత పెరగనుందా? అంటే అవుననే అంచనాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 29, 30 తేదీలతో పాటు డిసెంబర్ 1న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో Strong Cold Spell ప్రభావం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. వర్షాలతో ఉపశమనం పొందిన నగరవాసులకు త్వరలోనే చలి పరీక్ష మొదలుకానుంది.