34% బీసీ కోటాపై సుప్రీంకోర్టులో విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలనే నిబంధన ఏదీ లేదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని సమర్థిస్తూ పలు అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సీజేఐ ధర్మాసనాన్ని కోరే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.