కొత్త పింఛన్ల దరఖాస్తులపై పరిశీలన

18-09-2026 | 07:23pm

ఎంపీడీవో మంజుల

గండీడ్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఎంపీడీవో మంజుల(MPDO Manjula) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దరఖాస్తుదారుల నుంచి వివరాలు సేకరించి, పింఛన్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. 

అనంతరం ఎంపీడీవో మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వృద్ధాప్య, ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వారు సదరం క్యాంపులో పొందిన ధ్రువపత్రాలను పింఛన్ దరఖాస్తు ఫారంతో పాటు జతచేయాలని సూచించారు. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు