పండుగ సాయన్నకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన నివాళి
మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి): తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతి(Birth Anniversary of Panduga Sayanna) సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గురువారం మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేదలు,
బడుగు బలహీన వర్గాల కోసం పండుగ సాయన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేష్, కార్పొరేటర్లు కిషోర్, రమేష్ నాయక్, శరత్, నాయకులు అనంతరెడ్డి, కట్ట రవికిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.