కొమరం భీం జయంతి వేడుకలు
నిర్మల్, అక్టోబర్ 22 ( విజయ క్రాంతి): కొమరం భీమ్ 125వ జయంతిని ఆదివాసీ నాయక పోడు సంఘం(Adivasi Nayaka Podu Association) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం మొదట మరియు ఫారెస్ట్ కార్యాలయం ఎదురుగా ఉన్న కొమరం భీమ్ విగ్రహాలకు ఆదివాసి నాయక పోడు సేవా సంఘం, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంక గారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్ మాట్లాడుతూ... కొమరం భీమ్ జయంతి మరియు వర్ధంతి రోజులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సాధారణ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాల పరిసర ప్రాంతాల్లో కనీసం మొక్కలకు నీళ్లు పోసే పరిస్థితి కూడా లేదని,
ఈ ప్రాంతాలను వైన్స్, తాగుబోతులకు అడ్డగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయక పోడు ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ కార్యదర్శి శివ శంకర్, నాయక పోడు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సవీన్, రమేష్, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి గోవర్ధన్, జిల్లా బీజేపీ నాయకులు నర్సారెడ్డి, నైతం భీమ్ రావు, సూర్య భాను, ఉయిక భీమ్రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.