విఘ్నేశ్వరుడికి సీపీ పూజలు

20-09-2026 | 06:32am

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రామగుండం పోలీస్ కమిషనర్(Ramagundam Police Commissioner) అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం రోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ హనోక్, బెల్లంపల్లి పట్టణ పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు