గుడ్ బాయ్స్ హీరోలు కాదు, కానీ!

20-09-2026 | 05:35am

వెన్నెల కిశోర్(Vennela Kishore), శ్రుతి సోధి(Shruti Sodhi), రవిరాజా, వైవా హర్ష, వామ్సీ గౌడ్, గుండు సుదర్శన్, జోషి జోష్ క్రియేషన్స్, హైపర్ ఆది, రఘుబాబు, కిరణ్ మాచా, ఢీ పండు, రమణ భార్గవ్, అశ్విని అయ్యలూరు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుడ్ బాయ్స్(Good Boys)’. రాఘవ్ కథను అందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్‌లుక్ చూస్తుంటే ‘గుడ్ బాయ్స్’ సినిమా ఫుల్ కామెడీ, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు, ఊహించని అడ్వెంచర్లతో ప్రేక్షకులను మెప్పించబోతున్నట్లు తెలుస్తోంది. తాజా మోషన్ పోస్టర్‌లో మొత్తం గ్యాంగ్‌ను స్టైలిష్‌గా, ఫుల్ గందరగోళంగా ఉన్న సెటప్‌లో పరిచయం చేశారు. ‘వీళ్లు హీరోలు కాదు.. అసలు హీరోలకు దగ్గరగా కూడా రారు. కానీ విలన్లను ఎదుర్కొనేంత పిచ్చి ఉన్నవాళ్లు మాత్రం వీళ్లే’ అనే ట్యాగ్‌లైన్ ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు గౌతమ్ గోవిందరాజన్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు