గణపయ్య మండపం వద్ద అన్నప్రసాద వితరణ

22-09-2026 | 01:53pm

భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండల కేంద్రంలోని శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ మండలి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు(Ganesha Festival) భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మండపంలో కొలువుదీరిన గణపయ్యకు అర్చకులు ధీరజ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో మంగళవారం అన్న ప్రసాద వితరణ(Annaprasadam) కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భీమిని గ్రామ సర్పంచ్ బండి శ్రీకాంత్ గౌడ్, ఉప సర్పంచ్ బోనగిరి లోహిత్ గుప్తా, ఐత వంశీకృష్ణ, అన్నపురం మహేందర్, గన్నవరం శ్రీనివాస్, బండి సాయి, గుండ సాయి, నీలేష్, యూత్ సభ్యులు ఆరిఫ్, ఉయ్యాల వంశీ, మాదాసు ప్రశాంత్, కురిమిల్ల రాజకుమార్, జంబోజుల సాయి, కొవురు రాజశేఖర్, రంగు శ్రీకర్, మోర్ల బాబా, చిర్రం పోచన్న, జొరెగల తిరుపతి, కొప్పుల రవి, భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు