కుంకుమ పూజలు

18-09-2026 | 07:37pm

లక్షెటిపేట, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట (Luxettipet) పట్టణంలోని  గోదావరి రోడ్ రాంనగర్ (Godavari Road, Ramnagar) లోని వినాయక చవితి ఉత్సవాల్లో శుక్రవారం మహిళ భక్తులు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు.  శ్రీ సాయిగణేష్ యూత్ కమిటీ (Sri Saiganesh Youth Committee) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా మండపం వద్ద ఉదయం నుంచే మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పూజా మండపానికి చేరుకుని భక్తిభావంతో పూజలు చేశారు.

వినాయకుని విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు గణపతి నామస్మరణ చేస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిగణేష్ యూత్ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు