యావాపూర్ పాఠశాలలో న్యూట్రిషన్ డే కార్యక్రమం

19-09-2026 | 09:04pm

తూప్రాన్, సెప్టెంబర్ 19, (విజయ క్రాంతి): న్యూట్రిషన్ డే (Nutrition Day) సందర్భంగా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలోని ఎంపీయుపిఎస్ పాఠశాలలో (MPUPS School)ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ లు కలిసి విద్యార్థుల తల్లిదండ్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పేరెంట్స్ డే ను పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్వయంగా విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పోషక పదార్థాలు కలిగిన వంటకాలను తయారుచేసి ప్రదర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మరో కార్యక్రమానికి మిషన్ భగీరథ అధికారి మీనా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాంజాల స్వామి గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు స్వచ్ఛ నీటి వసతి కొరకు సదుపాయాలైన ప్యూరిఫై వాటర్ మిషన్ లను భగీరథ అధికారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ అరుంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్, పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు