పల్లెబాట పట్టిన ఎమ్మెల్యే..
- మండలంలో సుడిగాలి పర్యటన
- ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
పాపన్నపేట,సెప్టెంబర్19: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (MLA Mynampally Rohit Rao)పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పాపన్నపేట, కొత్త, పాత లింగాయిపల్లి, కొంపల్లి, కొడుపాక గ్రామాల్లో బోరు మోటార్లను ప్రారంభించారు. అనంతరం డాక్యతాండాలో స్కూల్ ప్రహరీ గోడ, ఇందిరమ్మ ఇల్లు, కొడపాకలో సీసీ రోడ్డులను ప్రారంభించి వినాయకుని పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృధే ధ్యేయమన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూరేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు శ్రీధర్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు సంగమేష్, సత్యాగౌడ్, గౌస్ పాషా, చోటు తదితరులు పాల్గొన్నారు.