ఎర్రగుంటపల్లిలో పోషణ మాసోత్సవం
19-09-2026 | 07:54pm
కోహెడ,(విజయక్రాంతి): మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ICDS) ఆధ్వర్యంలో కోహెడ మండలంలోని ఎర్రగుంటపల్లి(Erraguntapalli) గ్రామంలో పోషణ మాసోత్సవాన్ని(Nutrition Month) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ సాయి భవాని మాట్లాడుతూ.. గర్భిణీలు తీసుకోవలసిన పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించారు. స్థానికంగా లభించే పౌష్టికాహార పదార్థాలతో వంటకాలు తయారు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్, మినరల్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అందరూ సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.