మన భవిష్యత్తుకు పునాది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం

01-11-2026 | 06:57pm

ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్

ఘట్ కేసర్, నవంబర్ 1 (విజయక్రాంతి): మన భవిష్యత్తుకు పునాదిగా నిలిచేది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్(All India Students Federation VP Putta Laxman) ఉన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 290వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘట్ కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుట్ట లక్ష్మణ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఓటు మన హక్కు, మన ఆయుధం మన భవిష్యత్తుకు పునాది అని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువల స్ఫూర్తితో, ఓటుతో నాయకుడిని గెలిపించవచ్చు, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన నాయకుడిని ఓడించవచ్చు అన్నారు. అంబేద్కర్ ఒక కులానికో వర్గానికో పరిమితమైన నాయకుడు కాదని, ఆయన దేశానికి మార్గదర్శి, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయానికి ప్రతీక అని పేర్కొన్నారు.

ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఇరిటపు శ్రీనివాస్, కె.నర్సింగ్ రావు, కె. సత్యం, ఎం.ఎ. రెహమాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంచాల విజయ్, సి. ఆనంద్, కడపోల నర్సింగ్ రావు, ఎమ్‌డి అన్వర్, గంగారాం అంజయ్య, కె. చింటు, సాయికుమార్, పి కృష్ణ, బల్వంత్ రావు, ఈ. విష్ణు, శివ కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు