ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య

01-11-2026 | 01:39pm

చింతకుంట గ్రామంలో విషాద ఘటన.ఇంట్లోనే ముగ్గురి మృతి

తల్లికి మానసిక సమస్య? ఉన్నట్లు గ్రామస్తుల సభ్యుల అనుమానం

వికారాబాద్,(విజయక్రాంతి):  ఇద్దరు పిల్లలకు ఉరివేసి ఆపై తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో(Vikarabad District) శనివారం తీవ్ర కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. తల్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. చింతకుంట గ్రామానికి చెందిన భూపతిరెడ్డి, వాసవి దంపతులు పిల్లల చదువుల నిమిత్తం వికారాబాద్ పట్టణంలో(Vikarabad district) నివాసం ఉంటున్నారు. భూపతిరెడ్డి వృత్తిరీత్యా తాండూరులో ప్రైవేట్ అధ్యాపకుడిగా పనిచేస్తుండగా, వాసవి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిసింది.

ఆదివారం సెలవు కావడంతో శనివారం ఇద్దరు పిల్లలతో కలిసి వాసవి స్వగ్రామమైన చింతకుంటకు చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాసవి తన ఇద్దరు పిల్లలు వేదార్షి రెడ్డి (5), సాహర్ష రెడ్డి (3)లను హత్య చేసి, అనంతరం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 2017లో చేవెళ్ల మండలం మడికట్టు గ్రామానికి చెందిన వాసవితో భూపతిరెడ్డికి వివాహం జరిగింది కాగా, వాసవి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ వింతగా ప్రవర్తించేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న ధారూర్  ఎస్‌ఐ సురేష్ ఇబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ధారూర్ పోలీసులు   అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు