రైతు సదస్సును జయప్రదం చేయండి..

01-11-2026 | 08:27pm

గోవిందరావుపేట, నవంబర్ 1 (విజయక్రాంతి): రైతు సదస్సు విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers Union) విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. నవంబర్3న గోవిందరావుపేటలో పిఎస్ఆర్ గార్డెన్ లో జరుగుతున్న ప్రభుత్వ విధానాలు- వ్యవసాయ రంగంపై ప్రభావం అనే అంశంపై సెమినార్ ఉంటుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి తెలిపారు. ఈ సెమినార్ ను జయప్రదం చేయాలని వివిధ గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోతారని అంతేగాకుండా విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం వల్ల గతంలో ఉత్పత్తి రంగాన్ని మాత్రమే ప్రైవేటు శక్తులకు అప్పగిస్తున్నారని తెలిపారు. కానీ నేడు పంపిణీ కూడా ప్రైవేట్ రంగానికి ఇస్తూ విద్యుత్ డిస్కౌం పేరుతో  భవిష్యత్తులో మోటార్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ విధానాలపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 3న జరుగు సెమినార్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు హాజరవుతున్నారని తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు, గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, సోమ మల్లారెడ్డి, సూడి సంజీవరెడ్డి, కన్నోజు  సదానందం, మారబోయిన సారయ్య, ఐలయ్య, బానోత్ మంత్యా నాయక్, మొడెం కృష్ణ, వంక నగేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు