అనాథల భవిష్యత్తుకు ఆర్థిక చేయూత
రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన కాలనీ వాసులు
బిజినేపల్లి: మండల కేంద్రంలోని ఒకటవ వార్డులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఇద్దరు నిరుపేద పిల్లల భవిష్యత్తుకు కాలనీ వాసులు అండగా నిలిచి శుక్రవారం రూ. 50,000/- ఆర్థిక సాయం అందించారు. గతంలోనే తండ్రిని కోల్పోయిన ఆ పిల్లలు, ఇటీవల అనారోగ్యంతో తల్లి మైబమ్మను కూడా కోల్పోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన వార్డు, కాలనీవాసులు ఆ పిల్లల భవిష్యత్తుకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. మానవత్వంతో వారందరూ రూ.50,000 సమకూర్చి ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందించారు. ముఖ్యంగా బాలిక చదువు, భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆ మొత్తాన్ని పోస్టాఫీసులో జమ చేశారు.