విదేశీ పైలెట్లపై నిఘా అవసరం!

09-10-2026 | 05:35am
  1. ‘ఫ్లైదుబాయ్’ ఘటనతో ఉలికిపాటు 
  2. భారతీయ విమానయాన సంస్థలకూ పొంచిన ముప్పు?
  3. పైలెట్ల ఎంపికలోనే కఠిన నియమావళి రూపొందించాలి

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఫ్లైదుబాయ్(Flydubai) విమాన ఘటన అందరికీ తెలిసిందే. దురుద్దేశంతో కోపైలెట్ చేసిన దాడిలో గాయపడినా ప్రాణాలకు తెగించి 182మందిని సురక్షితంగా గమ్యం చేర్చిన భారతీయ సంతతి పైలెట్ చేసిన సాహసం విదితమే. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు(ఎయిర్‌లైన్స్) ఉలిక్కిపడేలా చేయడంతోపాటు పైలెట్ల ఎంపిక, వారి ప్రవర్తనపై మరింత నిఘాను పెట్టాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది.

నిజానికి మన దేశంలోనూ పలు వి మానయాన సంస్థలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ సంస్థల ఆధ్వర్యంలో వేలాది విమానాలు వివిధ దేశాలకు లక్షలాది మంది ప్రయాణీకులను తరలిస్తూ ఉంటాయి. ఫ్లైదుబాయ్ సంఘటన నేపథ్యంలో విదేశీ పైలెట్ల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరిం చాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే మన భారత దేశానికి చెందిన పలు విమానాల్లో వివిధ దేశాలకు చెందిన పైలెట్లు పనిచేస్తున్నారు. తాజా సంఘటన నేపథ్యం లో వారందరి ప్రవర్తన, జాతీయత నేపథ్యాన్ని మరోసారి పరిశీలించాలని పలువు రు నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌పై మరింత కోపం..

ఇదిలా ఉండగా.. ఫ్లుదుబాయ్ విమాన సంఘటనలో ఇండియన్ పైలెట్ స్మిత్ మచ్చర్ ప్రపంచ హీరో అయిపోయారు. ప్రధాని మోదీ, దుబాయ్ కింగ్, ఉప ప్రధా ని, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యా హు తదితరులతోపాటు అమెరికా ప్రెసిడెం ట్‌ట్రంప్‌కూడా అభినందించారు. 11/9 లాంటి మరో సంఘటన జరగకుండా ప్రా ణాలకు తెగించి సుమారు 182 మంది ప్ర యాణీకులను కాపాడిన మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు కురుస్తున్నాయి.

అయితే ఇదే సమయంలో టెర్రరిస్టు సంస్థలు మాత్రం భారత్‌పై మరింత కోపాన్ని, అసంతృప్తిని పెంచుకునే అవకాశం ఉందని భద్ర తారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మన దేశం అనేక టెర్రరిస్టు సంస్థల నుంచి ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొంటోంది. ఈ సంఘటనతో తమ ప్రణాళిక విఫలం అవ్వడం, అందుకు భారతీయ పైలెట్ కారణమనే అక్కసు టెర్రరిస్టు సంస్థలకు, మత ఛాం దసవాదుల్లో కలగడం సహజమే. అందుకే భారతీయ విమానయాన సంస్థలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

నిఘా, పటిష్ట సమాచారం..

భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వేలాది విమానాలు ప్రతిరోజూ ప్రయాణిస్తుంటా యి. భారత్‌పై అనేక ఉగ్రవాద సంస్థలు కన్నే సి ఉంచాయనేదికూడా వాస్తవమే. ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థల్లో పని చేసే విదేశీ పైలెట్ల ప్రవర్తన, వారి అసోసియేషన్‌పై, వారు ఏ దేశానికి చెందినవారనేదా నిపై మరింత నిఘా అవసరమని భద్రతారంగ నిపుణులు సూచిస్తున్నారు.

అలా అని ప్రతి ఒక్కరినీ అనుమానించాలనేది కాదని, అయితే ప్రయాణీకుల భద్రత, అలాగే దేశంలో ఎలాంటి విచ్ఛిన్నకర సంఘటన జరగకుండా తీసుకునే చర్యలో భాగంగానే విదేశీ పైలెట్లపై మరింత నిఘా పెట్టాలని వారు సూచిస్తున్నారు.

తాజా ఘటన నేపథ్యంలో టెర్రరిస్టు సంస్థల దృష్టి భారత్‌పై పడే అవకాశం ఉందని, అందుకే విదేశీ పైలెట్లు ఎక్క డికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏయే సంస్థలు, వ్యక్తులతో సంబంధాలున్నాయి అనే కోణాల్లోనూ సమాచారాన్ని సేకరించుకోవాలని, అవసరమైతే విదేశీ నిఘా సంస్థలు, పోలీసు, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమన్వయం చేసు కోవాలని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఫ్లుదుబాయ్ విమాన సంఘటనలో దుర్మార్గానికి పాల్పడిన ఒమన్ దేశీయుడు హమ్మామీ 2018 నవంబర్ 30 నుంచి 2019 మే 23 వరకు సుమారు 175 రోజులపాటు న్యూజిలాండ్‌లో స్టూడెంట్ వీసాపై గడిపినట్టుగా నిఘా, దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

అక్కడ హమ్మామీ ఎవరితో కలిసి ఉన్నారు. ఎవరిని కలిశారు. ఏమైనా తీవ్రవాద సంస్థల ప్రభావానికి గురయ్యారా అనే కోణంలోనూ న్యూజిలాండ్ పోలీసులు ద ర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యం లో అసలు విదేశీ పైలెట్లను ఎంపిక చేసుకునేటప్పుడే వారి ప్రవర్తన, వారు ఏయే సంస్థ లు, వ్యక్తులతో సన్నిహితంగా తిరుగుతున్నారు. అందులో తీవ్రవాద ప్రభావిత వ్యక్తులున్నారా. అలాంటి సంస్థల కనుసన్నల్లో తిరిగా రా అనే కోణాల్లో సమాచారాన్ని సేకరించి, నిర్ధారించుకున్న తరువాతనే వారిని పైలట్లుగా తీసుకోవానే డిమాండ్ వినపడుతోంది.

తాజా సంఘటనలో విమానాన్ని 11/9 తరహాలో క్రాష్ చేద్దామని అనుకున్నట్టు నిం దితుడు, కోపైలెట్ చెప్పడం, దీనిని భారతీ య పైలెట్ అడ్డుకున్న నేపథ్యంలో భారతీ య విమానాలకు మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అం దుకే ఆ దిశగా మరింత నిఘా, పటిష్టమైన సమాచార సేకరణ, విదేశీ పైలెట్ల ఎంపికలో జాగ్రత్త అవసరమనే భద్రతా రంగ నిపుణు లు హెచ్చరికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశిద్దాం! 

మరిన్ని వార్తలు