వ్యవసాయ పొలంలో అక్రమ తవ్వకాలు

09-10-2026 | 01:24pm

- పోలీసులకు పిర్యాదు చేసిన రైతు

బిజినేపల్లి: మండలంలోని వట్టెం గ్రామ(Vattem village) శివారు 123 సర్వే నెంబరులో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి అక్రమంగా వ్యవసాయ పొలం(agricultural land)లోకి ప్రవేశించి తవ్వకాలు జరిపారని రైతు లక్ష్మణ్ శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశాడు. రైతు లక్ష్మణుకు చెందిన దాయాదులు యంత్రాలతో పొలంలోకి ప్రవేశించారని, అందులోని మట్టిని తవ్వి గుంతలు(Illegal Excavation)గా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై పోలీసుల వివరణ కోరగా పిర్యాదు అందిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు