నిర్ణీత గడువులోగా ఆసుపత్రి పనులను పూర్తి చేయాలి

27-10-2026 | 11:58am

నాగర్‌కర్నూల్‌ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్‌ మెడికల్‌ కళాశాల(Nagarkurnool Medical College) ఆవరణలో నిర్మిస్తున్న 550 పడకల ఆసుపత్రి పనులను నిర్ణీత గడువు లోగా నాణ్యత పాటిస్తూ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌(Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎండీ సులేమాన్‌, ఇంజినీరింగ్‌ అధికారి సుధాకర్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు