జ్ఞానేశ్‌కు సీజేపీ డెడ్‌లైన్

04-10-2026 | 05:20am
  1. ఈ నెల 10 లోపు తప్పుకోవాల్సిందే..
  2. లేకుంటే అదేరోజు జంతర్ మంతర్ 2.0 తప్పదు
  3. సీజేపీ వ్యవస్థాపక నేత అభిజీత్‌దిప్కే వార్నింగ్
  4. మమతకు దీప్కే కృతజ్ఞతల పోస్ట్‌పై ‘ఎక్స్’ ఆంక్షలు

ముంబై, అక్టోబర్ 2: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్( CEC Gyanesh Kumar's) రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ(cacroch Janata Party ) డెడ్‌లైన్ విధించింది. ఈ నెల 10 వరకు తప్పుకోకపోతే అదేరోజు ఢిల్లీలోని ‘జంతర్ మంతర్ 2.0’ నిరసన సత్తా ఏంటో చూపిస్తామని సీజేపీ నేత అభిజీత్ దిప్కే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఢిల్లీపోలీసులు తమ నిరసనకారులను ఎక్కడ అడ్డగిస్తోందో అక్కడా తమ జంతర్‌మంతర్ అవుతుందని హెచ్చరించారు.

తమ నిరసన శాంతియుతంగా ఉంటుందని చెబుతూ, ‘మేము మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తాం’ అని స్పష్టం చేశారు. శాంతియుత నిరసన హక్కును గౌరవించాలా లేక ‘జూలై 20న చూసిన అరాచకాన్ని పునరావృతం చేయాలా’ అనేది ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులే నిర్ణయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న కాక్రోచ్‌లు (పార్టీ కార్యకర్తలు/మద్దతుదారులు) ఢిల్లీకి తరలి వస్తారని, ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతారని స్పష్టం చేశారు.

ఇది భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటమని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకునే ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వాములు కావాలని అభిజీత్‌దీప్కే పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అభిజీత్‌దీప్కే కృతజ్ఞతలు తెలులిపారు. శనివారం తాను చేసిన ఈ పోస్టుపై ‘ఎక్స్ ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో ఈ నెల10 లోపు తన ‘ఎక్స్’ ఖాతా తొలగించినా ఆశ్చర్యం లేదని ఆయన స్పష్టం చేశారు. కాక్రోచ్ ఉద్యమానికి ‘మీ మద్దతును అందించినందుకు ధన్యవాదాలు మేడమ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భారతీయులందరూ ఏకం కావాలి’ అని మమతకు పోస్టు చేశారు. దీన్ని టీఎంసీ రాజ్యసభ జాయింట్ సెక్రటరీ డెరెక్ ఓబ్రియన్ షేర్ చేశారు. ఆ తర్వాత దానిపై ఎక్స్ ఆంక్షలు విధించింది.

ఇదిలా ఉంటే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సీజేపీ నేత అభిజీత్ దీప్కేను కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే శనివారం విమర్శించారు.

ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటుందని అథవాలే ముంబైలో మీడియాతో పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ దేశ పురోగతికి ఎంతో కృషి చేశారని పేర్కొన్న అథవాలే, చరిత్రను పరిగణనలోకి తీసుకోకుండా దీప్కే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 


మరిన్ని వార్తలు