భారత్ సీరియస్

12-10-2026 | 08:50am

న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నౌకాయాన భద్రతకు ముప్పు కలిగించే ఘటనలను ఖండించింది. తాజాగా డ్రోన్ దాడికి గురైన MT Petro Dolphin నౌకలో ఉన్న ఇద్దరు భారతీయ నావికులు గల్లంతైనట్లు సమాచారం. ఆ నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మార్షల్ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న MT Valdera ఆయిల్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, అందులో ఉన్న 11 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన Strait of Hormuzలో చోటుచేసుకున్న ఈ ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమయ్యాయి. వాణిజ్య నౌకలపై దాడులు సముద్ర భద్రతతో పాటు Global Oil Supply, అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్లంతైన భారతీయ నావికుల ఆచూకీ, డ్రోన్ దాడి వెనుక కారణాలు, నౌకలపై దాడులకు బాధ్యులెవరనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నౌకల్లో ఉన్న భారతీయుల భద్రతపై సంబంధిత అధికారుల తదుపరి సమాచారం కీలకంగా మారింది.

మరిన్ని వార్తలు