గ్యాస్ పీల్చుకుని సాఫ్ట్‌వేర్‌ ఆత్మహత్య

12-10-2026 | 08:04am

10 ఏళ్లుగా కడుపునొప్పి.. చివరకు విషాదాంతం!

హైదరాబాద్: కొండాపూర్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన కలకలం రేపింది. రాఘవేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ శేఖర్ మృతదేహంగా కనిపించారు. ఆయన రాయదుర్గంలో తన సోదరుడితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన శేఖర్.. అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో తాను కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో స్నేహితులతో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆదివారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్పందన రాలేదు. దీంతో ఆయన తెలిపిన చిరునామాకు వెళ్లి చూడగా తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చి వాటిని తెరిచి చూడగా శేఖర్ మృతిచెంది కనిపించారు.

కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, హీలియం వాయువును పీల్చడం వల్ల ఆయన మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం సమీపంలో లభించిన Suicide Noteలో గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు శేఖర్ పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని Post-mortem Examination కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు