విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ధర్నా
శ్రీరంగాపూర్: వనపర్తి జిల్లా(Wanaparthy District) శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో విద్యార్థుల పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ(ABVP ) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్ మాట్లాడుతూ... నగరాల, పుల్గర్‌చర్ల, షేర్‌పల్లి, కంబాలాపూర్ తదితర గ్రామాల నుంచి విద్యార్థులు శ్రీరంగాపూర్‌కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు(Students) ఇబ్బందులు పడుతున్నారని, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నందు, యశ్వంత్, కార్తీక్, శివప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు.