ప్రమాదరహిత ఉత్పత్తి సాధించాలి

25-09-2026 | 08:38pm

శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్

నస్పూర్, (విజయక్రాంతి) : ప్రమాదరహిత ఉత్పత్తి సాధించేందుకు అందరు కలిసికట్టుగా పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీమునిగంటి శ్రీనివాస్(Srirampur GM Srimuniganti Srinivas) అన్నారు. డీజీఎంఎస్ అధికారులు బృందం ఆధ్వర్యంలో శుక్ర వారం శ్రీరాంపూర్ ఏరియాలో హాలేజ్ ప్రమాదాల నివారణపై సీసీసీ సింగరేణి గెస్ట్ హౌజ్ లో డీజీఎంఎస్ (మైనింగ్) డాక్టర్ సాగేష్ కుమార్, డీడీఎంఎస్ (మైనింగ్) దీపక్ కుమార్ ప్రభాకర్, డీడీఎంఎస్ (మెకానికల్) అనికేత్ సింగ్ పర్యవేక్షణలో నిర్వహించిన వర్క్ షాపులో ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణిలో రక్షణకే ప్రధమ ప్రాధాన్యత అని, అవర్ ఏమ్ జీరో హామ్ ను ఆచరణ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదాలు చోటుచేసుకుంటే వాటి నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, రూట్ కాజ్ ఎనాలసీస్ (మూల కారణాల విశ్లేషణ) ద్వారా ప్రమాద కారణాలు విశ్లేషించి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

ప్రతి రోజు ఎస్ఓపీ, ఎస్ఎంపీలకు అధనంగా వీటిని జోడించి అవగాహన కల్పిస్తూ వాటి నియంత్రణకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. హాలేజ్ ప్రమాదాలు ఏమాత్రం క్షమార్హం కాదని, హాలేజ్ ప్రమాదాలను టెక్నికల్ కంట్రోల్స్, ఆడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, సబ్ స్టిట్యూట్ కంట్రోల్స్ ఆధారంగా నియంత్రచవచ్చునన్నారు. అంతకు ముందు ఇటీవల చోటుచేసుకున్న హాలేజ్ సంబంధిత ప్రమాదాలపై ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సత్యనారాయణ పీపీటీ ఇచ్చారు. గనుల వారీగా చోటుచేసుకన్న ప్రమాదాలు, ప్రమాద కారణాలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను డీజీఎంఎస్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

గనుల వారీగా ఏజెంట్లు, మేనేజర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకొని  ప్రమాదాల తీరుతెన్నులు, వాటి నివారణ పై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జీఎం(సేఫ్టీ) రఘుకుమార్, ఎస్ ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ AV రెడ్డి, ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, ఆర్కే గ్రూప్ ఏజెంట్ N శ్రీధర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సత్యనారాయణ, అన్ని గనుల మేనేజర్లు, ఏజెంట్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, రక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు