పాటలు పెడితే కేసులా? మరి దానం డ్యాన్స్ సంగతేంటి?

25-09-2026 | 11:16am

శోభాయాత్రలో దానం నాగేందర్ సందడి.. డీజే పాటకు స్టెప్పులు!

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) సందడి చేశారు. ఆయన కోసం డీజే నిర్వాహకులు ప్రత్యేకంగా పాట వేయడంతో.. దానం నాగేందర్ అక్కడే స్టెప్పులు(Danam Nagender Dance Video) వేశారు. డీజే మ్యూజిక్‌కు తగ్గట్టుగా ఆయనతో పాటు కొంతమంది పోలీసులు కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అక్కడి వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది. ఈ సన్నివేశాన్ని అక్కడున్న పలువురు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో(Khairatabad Ganapati) భక్తుల సందడి, డీజే మ్యూజిక్, నృత్యాలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దానం నాగేందర్  ఆయా షేర్ పాట మీద డ్యాన్స్ చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఆయనతో పాటు అక్కడ విధుల్లో ఉన్న కొంతమంది పోలీసులు కూడా డీజే పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, శోభాయాత్రలో రాజకీయ పార్టీల పాటలు ప్లే చేస్తే కేసులు పెడతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) హెచ్చరించిన నేపథ్యంలో.. ఇప్పుడు జరిగిన ఈ సన్నివేశంపై సీపీ సజ్జనార్ సార్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.


మరిన్ని వార్తలు