ప్యారడైజ్ ఫస్ట్ డే ఫైర్.. నైజాం షేక్!
నాని ‘ది ప్యారడైజ్’ నైజాంలో బాక్సాఫీస్‌ను(The Paradise Nizam Box Office) షేక్ చేస్తోంది! శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే నైజాం ఏరియాలో భారీ వసూళ్లను నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి రోజు GSTతో కలిపి రూ.15.7 కోట్ల షేర్, రూ.23 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా టైర్-2 హీరోల సినిమాల్లో ఈ స్థాయి నైజాం ఓపెనింగ్ అరుదైన రికార్డుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
నైజాం థియేట్రికల్ రైట్స్(Nizam theatrical rights) సుమారు రూ.31 కోట్లకు అమ్ముడైన నేపథ్యంలో.. ప్రీమియర్స్, డే 1 కలెక్షన్లతో కలిపి ఇప్పటికే దాదాపు 50 శాతం రికవరీ పూర్తయినట్లు ట్రేడ్ సమాచారం. ఇక రెండో రోజుకూ బుకింగ్స్ బలంగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా B,C సెంటర్లలో ప్రేక్షకుల స్పందన ఊపందుకోవడంతో ‘ది ప్యారడైజ్’ నైజాం రన్‌పై ఆసక్తి మరింత పెరిగింది. తొలి రోజు దూకుడు కొనసాగితే సినిమా బ్రేక్‌ఈవెన్ ప్రయాణం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.