భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ కు భారీగా హాజరైన విద్యార్థులు

04-10-2026 | 03:05pm

బోథ్ అక్టోబర్ 4 (విజయక్రాంతి): విద్యార్థులలో ప్రతిభ, సృజనాత్మకత, జ్ఞానం పోటీ తత్వం, దేశభక్తి పెంపొందించేందుకు ఏఐఎస్ఎఫ్(AISF) ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్(Talent Test)కు 700 పైగా విద్యార్థులు హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ ప్రతిభ పరీక్షకు మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మున్సిఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు గోవర్ధన్, ముక్రం, శ్రీకాంత్, వెంకటరమణ .సాగర్. సాహెబ్ వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు