నార్నూర్ మార్కెట్ యార్డులో బ్యాటరీల చోరీ
- 9 బ్యాటరీలను చోరీ చేసిన ముగ్గురు నిందితుల అరెస్ట్...
- చోరీకి గురైన రూ 85,500 విలువచేసే, 9 బ్యాటరీలు స్వాధీనం...
- నార్నూర్ సీఐ అంజమ్మ...
ఉట్నూర్, సెప్టెంబర్ 30( విజయక్రాంతి ): నార్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో(Narnoor Agricultural Market Yard) వాహనాల నుంచి మరియు సమీప వాహనాల నుండి బ్యాటరీలను చోరీ చేసిన ముగ్గురు నిందితులను నార్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీకి గురైన 9 బ్యాటరీలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నార్నూర్ సీఐ అంజమ్మ తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగిందని అన్నారు. బ్యాటరీలు చోరీ చేసిన వారిలో మెస్రం నితిన్ (22), కొట్నక్ చితృ @ సీతారాం (24), సలాం గజపత్ రావు @ గజ్జు (23) ముగ్గురూ నార్నూర్ మండలం గుండాల గొండగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు.
ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 25వ తేదీ ఉదయం 7 గంటల మధ్య నార్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పార్క్ చేసిన వాహనాల నుండి వాటి సమీప వాహనాల నుండి 9 బ్యాటరీలను చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.85,500/- బాధితుల ఫిర్యాదు మేరకు నార్నూర్ పోలీసులు క్రైం నం.117/2026, సెక్షన్ 305(b) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీకి గురైన 9 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్సై శ్రీ సాయి మరియు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగిందని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు తరలించడం జరిగిందని అన్నారు.