బీజేవైఎం అధ్యక్షుడిగా భూక్య విజయ్

19-09-2026 | 09:20pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా (Bharatiya Janata Yuva Morcha)(బీజేవైఎం) కేసముద్రం మండల నూతన అధ్యక్షుడిగా భూక్య విజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దిడ్డి మహేష్  నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించినందుకు, తనపై నమ్మకం ఉంచినందుకు భూక్య విజయ్,జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జతోత్ హుస్సేన్ నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దిడ్డి మహేష్,బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శులు చీకటిమహేష్, గుగులోత్ మధన్ నాయక్, గడ్డం అశోక్ కుమార్ ,జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి, కేసముద్రం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు