భువీకి కెప్టెన్సీ.. టీమ్‌లో స్టార్‌లే!

05-10-2026 | 01:15pm

భువీకి కెప్టెన్సీ.. హాంకాంగ్ సిక్సెస్‌కు టీమిండియా స్టార్స్ రెడీ!

భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) మరోసారి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరగనున్న Hong Kong Sixes 2026 కోసం భారత జట్టుకు భువీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. భువనేశ్వర్ నాయకత్వంలో బరిలోకి దిగే India Hong Kong Sixes Teamలో IPL‌లో సత్తా చాటిన పలువురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కృనాల్ పాండ్యా, శశాంక్ సింగ్, రాహుల్ తెవాటియా, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, టీ. నటరాజన్ భారత జట్టులో ఉన్నారు.

కెప్టెన్ భువీ.. టీమ్‌లో స్టార్‌లే!

Bhuvneshwar Kumar Captainగా ఎంపిక కావడం ఈ జట్టులో ప్రధాన ఆకర్షణగా మారింది. అతనితో పాటు కృనాల్ పాండ్యా, రాహుల్ తెవాటియా, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, టీ. నటరాజన్ వంటి ఆటగాళ్లు గతంలో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. శశాంక్ సింగ్ మాత్రం భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆటగాడిగా ఈ జట్టులో ఉన్నారు.

Hong Kong Sixes 2026పై ఫోకస్

చిన్న ఫార్మాట్ అయిన Hong Kong Sixesలో ప్రతి బంతి, ప్రతి ఓవర్ కీలకంగా మారుతుంది. అందుకే అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ నాయకత్వం భారత జట్టుకు ఆసక్తికరంగా మారింది. IPLలో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఒకే జట్టుగా బరిలోకి దిగడంతో Hong Kong Sixes India Teamపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరిగే ఈ టోర్నీలో భువీ సారథ్యంలోని భారత జట్టు ఎలా రాణిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా Bhuvneshwar Kumar, Krunal Pandya, Nitish Rana, Rahul Tripathi, Rahul Tewatia, T Natarajanలతో కూడిన ఈ స్క్వాడ్ చిన్న ఫార్మాట్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు