మంచినీటి నుంచి దోమల వరకు
ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లెందు(Illendu) పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్య(water problem)తో పాటు మురికి కాలువల శుభ్రత, కోతులు, వీధి కుక్కలు, దోమల బెడదను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్(BRS) నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో మురికి కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, మంచినీటి సరఫరాలో ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కోతులు, వీధి కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, దోమల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, టీజీబీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ జాఫర్, మాజీ కౌన్సిలర్ ఎలమంద వాసు, నారపాక వసంత్, రాచపల్లి శ్రీనివాస్, మురళి, గడ్డి శీను, పరకపల్లి రవి, ఎస్కే సర్దార్ భాయ్, వైకుంఠం, ఎస్కే సాదిక్, డేరంగుల పోశం, మునిగంటి శివ, రాంలాల్ పాసి తదితరులు పాల్గొన్నారు.