‘సిద్ధయ్య’ పాట పెద్ద హిట్ కావాలి: లిరిసిస్ట్ చంద్రబోస్
సిద్ధు రెడ్డి, కాత్యాయని జగన(Katyayani Jagana) నటించిన ‘ఓ నా సిద్ధయ్య’ పాట(Oh Naa Siddayya song )కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. రామ్ అద్నాన్ ఈ పాటను రాసి తెరకెక్కించారు. కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ పాటను ఆలపించారు. అరుణ్ కొలుగూరి కెమెరా, ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. కందకట్ల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ పాటకు సంబంధించి టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. “సిద్ధుతో నాకు ఆరేడు నెలల పరిచయమే అయినా ఆరేడు జన్మల బంధం ఉన్నట్టుగా అనిపిస్తోందని గీత రచయిత చంద్రబోస్(Lyricist Chandrabose) తెలిపారు. సిద్ధు కోసం ఓ మంచి పాట రాశా. అది త్వరలో రాబోతోంది. రామ్ చేసిన ‘ఓ నా సిద్ధయ్య’ పాట ముందుగా రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది. రామ్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఈ పాటలో సిద్ధు గొప్పగా నటించాడు. తెరపై, తెర వెనుక సిద్ధు ఒకటేలా ఉంటారు. సిద్ధు చేసే సేవా కార్యక్రమాల గురించి వింటూ ఉన్నా. సిద్ధు ఇలానే మున్ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.