జూరాల రైతుల ఘర్షణ.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

22-09-2026 | 11:00am

మహమ్మదాబాద్:సెప్టెంబర్ 22(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు స్వచ్ఛందంగా జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచిన ఘటనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా పంటలను పరిశీలించి, జూరాల ప్రాజెక్టును సందర్శించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడు జూరాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మండల పరిధిలోని పలువురు బీజేపీ నాయకులను మహమ్మదాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా నాయకుడు కరువు కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కాశీనాథ్, మండల ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శ్రీనివాసులు, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.జూరాల నీటిపై రైతుల సమస్యలను పరిష్కరించాలని, ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు