భిక్కనూర్ పీహెచ్‌సీలో అమ్మఒడి కార్యక్రమం
22-09-2026 | 11:56am
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Bhiknoor Primary Health Center)లో డాక్టర్ యేమీమా ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. బస్వాపూర్, కాచాపూర్, కంచర్ల, ఇస్సన్నపల్లి గ్రామాల నుంచి గర్భిణులను 102 వాహనాల్లో ఆశా కార్యకర్తలు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వారికి రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం(Nutrition), ఆరోగ్య జాగ్రత్తలపై డాక్టర్ యమీమా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లు సుభాషిణి, హరిత, ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, ఎంఎల్‌హెచ్‌పీ ప్రశాంత్, పీహెచ్‌ఎన్ జానకి, హెల్త్ సూపర్‌వైజర్లు రాజమణి, సువర్ణ, హెల్త్ అసిస్టెంట్లు యాదమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.