యాదగిరిగుట్ట కొండపైన అపశృతి.. దర్శనాలు నిలిపివేత

22-09-2026 | 12:15pm

కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట కొండ(Yadagirigutta hill)పై అపశృతి నెలకొంది. కొండపైన బిక్షాటన చేస్తున్న యాచకురాలి(Beggar)ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద యాచకురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతురాలు యాదగిరిగుట్ట(Yadagirigutta)కు చెందిన ఈశ్వరమ్మగా గుర్తింపు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కారు డ్రైవర్ ను‌ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ప్రమాదంలో యాచకురాలు చనిపోయిన కారణంగా గుడి మూసేసి దర్శనాలు నిలిపివేసిన ఆలయ అధికారులు, ఆలయ సంప్రోక్షణ అనంతరం తిరిగి దర్శనాలు పునురుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు