రిమ్స్ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం
22-09-2026 | 09:52am
రిమ్స్ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏసీ షార్ట్‌సర్క్యూట్(AC short circuit) కారణంగా మంటలు చెలరేగి, ఐదు రోజుల పసికందు సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫైర్, విద్యుత్ భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు.