అర్ధరాత్రి అగ్నిప్రమాదం..బలైన రెండు పసి ప్రాణాలు

22-09-2026 | 07:44am

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి(Adilabad RIMS Hospital)లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో వార్డులో మొత్తం 27 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు చిన్నారులు గాయపడి అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారితో పాటు ఇతర చిన్నారులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతులు, గాయపడిన చిన్నారుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు