పోస్ట్ మార్టంకు డబ్బులు డిమాండ్.. ఆర్డీవోకు ఫిర్యాదు
బోధన్, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం(Post-mortem) నిర్వహించేందుకు కొంతమంది సిబ్బంది మృతుల కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత(Parliament Telugu Yuvatha) బోధన్ నియోజకవర్గం ఇన్చార్జి ఎత్తుండ రాజేందర్ బోధన్ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న వారి వద్ద పోస్ట్మార్టం కోసం డబ్బులు అడగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని.
జత రాజేందర్ కోరారు. డబ్బులు ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు చూపించే స్క్రీన్షాట్ జిరాక్స్ కాపీని ఫిర్యాదుకు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అవగాహన కల్పించాలని వినతిభవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో "పోస్ట్ మార్టం కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి" అనే సమాచారాన్ని ప్రజలకు కనిపించేలా ప్లెక్సీలు, గోడ రాతలు లేదా నోటీసుల రూపంలో ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఫిర్యాదు చేసేందుకు సంబంధిత ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది