సీఎం బహిరంగ సభకు భారీగా తరలిన రుద్రంగి మండల ప్రజలు, నాయకులు
రుద్రంగి సెప్టెంబర్ 30(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాల్గొంటున్న భారీ బహిరంగసభకు రుద్రంగి మండలం మరియు ఉమ్మడి మానాల గ్రామాల నుండి దాదాపు 35 బస్సుల్లో 2000మంది వరకు భారీగా స్వచ్ఛందంగా తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య,సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య,మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ప్రజల్లో ఇంత ఆదరణ లభించిందని అన్నారు.నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నా పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తున్నారని అన్నారు.ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగి నుండి 2వేల మందిమి సభకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అక్రమాల చిట్టను సీఎం రేవంత్ రెడ్డి
బయట పెడుతున్న సందర్భంగా జనం సభకు రావడం జరుగుతుందని అన్నారు.కేసీఆర్ ను సిఎం గా గద్దె దింపడం జరిగిందని ఇట్టి సభతో కేటీఆర్ ను ఎమ్మెల్యే గా గద్దె దింపడంతో పాటు కేటీఆర్ చేసిన అవినీతి ని బయటపెట్టడం కాయం అని అన్నారు.ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా రూపురేఖలు మరనున్నాయని అన్నారు.....