భూ భారతి-భూ రి సర్వే కు గ్రామస్తులు సహకరించాలి

30-09-2026 | 03:54pm

జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక

మాగనూరు ,సెప్టెంబర్ 30: గ్రామంలో చేపట్టే భూ భారతి- భూ రీ సర్వే(Bhu Bharati- Land Survey) కార్యక్రమానికి వచ్చే అధికారులకు గ్రామస్తులు సహకరించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక గ్రామస్తులను కోరారు. బుధవారం మాగనూరు మండల పరిధిలోని గజరం దొడ్డి గ్రామంలో భూ భారతి -భూ రి సర్వే ఫై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ యొక్క అవగాహన సదస్సుకు నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారికంగా పాల్గొని మాట్లాడుతూ గ్రామంలోని రైతులు భూముల విషయంలో కొట్లాటలు, పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టు కేసులు ,తదితర వాటిని ఎదుర్కొంటున్నారు. రైతులకు న్యాయం చేయాలని సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం భూ భారతి-భూ రీ సర్వే కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.

రైతులు పోలాల గట్ల విషయం లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే విషయాలపై మనస్పర్ధలు లేకుండా భూ సర్వే నిర్వహించే అధికారులకు సహకరించి భూములు సర్వే చేసుకోవాలన్నారు. సర్వే చేసిన భూములకు హద్దులు కూడా చూయించి రాళ్లు పాటిస్తారు అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు సహకరించాలని వారు కోరారు. అంతకుముందు గజరం దొడ్డి గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక గారికి తహసిల్దార్, ఎంపీడీవో, పూల మొక్కను అందించరు.

అనంతరం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దు రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ లింగం, తహసిల్దార్ అబ్దుల్ రెహమాన్, మండల స్పెషల్ ఆఫీసర్ జగదీశ్వరి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు నర్సిరెడ్డి,గోవింద్ రెడ్డి, గోపాల్ రెడ్డి ,వెంకట్ రెడ్డి, భీమ్ రెడ్డి రైతులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు