అదనపు బస్సులు నడపాలని సీపీఐ విజ్ఞప్తి

30-09-2026 | 03:00pm

మణుగూరు, సెప్టెంబర్ 30,(విజయక్రాంతి ): మణుగూరు ఆర్టీసీ డిపోలో అదనపు బస్సు సర్వీసులు నడపాలని సీపీఐ నాయకులు(CPI leaders ) డిమాండ్ చేశారు.బుధవారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యాంసుందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మణుగూరు–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సులను యథాతథంగా పునరుద్ధరించాలని కోరారు. మణుగూరు–కొత్తగూడెం మార్గంలో అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాత్రి 9 గంటల తర్వాత ఖమ్మం నుంచి మణుగూరుకు ప్రత్యేక బస్సు నడపాలని కోరారు.

మణుగూరు–గుండాల మార్గంలో రాత్రి నైట్‌హాల్ట్‌కు బదులుగా సాయంత్రం ట్రిప్ ఏర్పాటు చేయాలని సూచించారు.విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఇతర ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, ఎస్కే సర్వర్, మంగి వీరయ్య, కొత్తపల్లి సీతారాములు, ఎస్‌డీ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు