అల సంద్రవంకోలే వున్నావే పిల్లా..
నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’(Raj Weds Rambai) ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’(Crazy Wedding). ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘అల సెంద్రవంక’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఓ అలసంద్రవంకోలే వున్నావే పిల్లా.. ఇలవాలికి మెరిసిందే నీ అందం వల్ల..’ అంటూ సాగుతోందీ గీతం. ‘అందం మురిసే..
గంధం కురిసే పిల్లా నీ మేని సొగసులనే చూసి.. వేకువలోనా వెన్నెల కాసి, పిల్లా నీ పెదవులపై నవ్వు పూసే.. నీ అడుగులతోనే అవనే పులకించే.. నీ తనువును తాక మేఘం తలవంచే.. సింగిడి రంగులతో పొంగే ఆకాశం.. నీ ఒంటికి చీరై నిగనిగ మెరిసిందా..’ అనే సాగి ఈ పాటకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. సురేశ్ బొబ్బిలి స్వరపర్చిన ఈ పాటకు జీ వెంకన్న రాయగా, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: శ్యామ్ దూపాటి; సంగీతం: సురేశ్ బొబ్బిలి; లిరిక్స్: గోరటి వెంకన్న, చైతన్యప్రసాద్, కాసర్ల శ్యామ్; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్; ఎడిటర్: శ్రావణ్ కటికనేని; ఆర్ట్: సాయి కదిర.