అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను(Development works) వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్(Bellampalli Municipality) పరిధిలో మున్సిపల్ కమిషనర్ రమేష్ తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధిలో(Development of Municipalities) భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఈ క్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై(Sanitation Management) ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్త లను సేకరించి డంపింగ్ యార్డ్(Dumping yard) కు తరలించాలని, నీటి నిల్వలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాల తహసిల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనిఆదేశించారు.
భూ సమస్యల పరిష్కారం(Resolution of land issues) లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియలో గ్రామ నక్షాలు, వివిధ రకాల భూముల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 22 ఎ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
ఎస్ ఐ ఆర్ హియరింగ్ పరిశీలన
అనంతరం కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ 2026 హియరింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఆసుపత్రి పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రీ సర్వే, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.