చెత్తబుట్టలు పంపిణీ చేసినా వార్డ్ సభ్యులు
30-09-2026 | 07:49pm
చేగుంట, సెప్టెంబర్ 30 , విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రం లోని 11వ వార్డ్ లో , జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్(District Collector Pratima Singh) ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ లక్ష్యంగా వార్డ్ లో బుధవారం వార్డ్ సభ్యులు అస్మా పర్వీన్, రహీమోద్దీన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి రెండు బుట్టలను అందజేస్తున్నామని, ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి . గ్రామపంచాయ ట్రాక్టర్లతో వేయాలని,. వర్షాకాలం నేపథ్యంలో వార్డ్ లో వ్యాధులు ప్రబలకుండా,పరిశుభ్రతను కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని, ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరారు.