యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి పోటీలు

18-09-2026 | 07:57pm

ఖానాపూర్ (విజయక్రాంతి): యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో డివిజన్ స్థాయి యువ టూరిజం పోటీలు(Division-level youth tourism competition) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డ్యాన్స్, డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా డ్యాన్స్ పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ పాత ఎల్లాపూర్ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా, జెడ్పీహెచ్‌ఎస్ మున్యాల్ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. డ్రాయింగ్ పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవగా, జెడ్పీహెచ్‌ఎస్ మస్కాపూర్ పాఠశాల విద్యార్థి ద్వితీయ స్థానం సాధించారు. డివిజన్ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు