జిల్లాలో భూసేకరణలో దళారులను నమ్మి మోసపోవద్దు

25-09-2026 | 07:59pm
  1. నష్టపరిహారం నేరుగా భూ బాధితులకే.. 
  2. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరిక

పెద్దపల్లి, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి) భూసేకరణలో ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) భూ బాధితులను హెచ్చరించారు. రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణకు జరుగుతున్న భూసేకరణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని నేరుగా అర్హులైన భూ బాధితులకే అందజేస్తామని స్పష్టం చేశారు.

కొంతమంది దళారులు, మధ్యవర్తులు అధిక పరిహారం ఇప్పిస్తామని అమాయక భూ యజమానులను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డబ్బులు అడిగితే అధికారులకు సమాచారం భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, అనుమానాస్పదంగా వ్యవహరించినా వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం చెల్లింపు ప్రక్రియ జరుగుతుందని, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భూములు కోల్పోతున్న రైతులు, భూ యజమానులు మధ్యవర్తుల మాటలు నమ్మకుండా అధికారిక మార్గాల్లోనే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

మరిన్ని వార్తలు