ఎడపల్లి రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

20-09-2026 | 12:42am

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది

ఎడపల్లి,(విజయక్రాంతి): ఎడపల్లి మండల(Edapalli Mandal) కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు(Elderly woman) తీవ్రంగా గాయపడింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మంగల్‌పాడు గ్రామానికి చెందిన భూమవ్వ కొత్త బస్టాండ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భూమవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఎడపల్లి 108 సిబ్బంది ఈఎంటీ లక్ష్మణ్, పైలట్ నరేష్ వెంటనే స్పందించి వృద్ధురాలికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి(Nizamabad District Hospital)కి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో భూమవ్వ వద్ద లభించిన బంగారు మంగళసూత్రం, నగదు, సెల్‌ఫోన్‌ను 108 సిబ్బంది భద్రంగా ఉంచి, ఆమె కుమారుడు గంగాధర్‌కు అప్పగించారు. ఆపదలో ఉన్న వృద్ధురాలిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పాటు, ఆమెకు సంబంధించిన విలువైన వస్తువులను కుటుంబ సభ్యులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.

మరిన్ని వార్తలు