చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరి దేవి
ములుగు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ(Legal Services Authority) కార్యదర్శి చండీశ్వరి దేవి(Chandishwari Devi) అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల(National and State Legal Services Authorities) ఆదేశాలను అనుసరించి ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ(District Legal Services Authority, Mulugu) అధ్యర్యంలో శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరి దేవి పాల్గొని మాట్లాడుతూ బాల్యవివాహ నిరోధక చట్టం గురించి, పొక్సో చట్టం(POCSO Act) గురించి, సైబర్ క్రైమ్(Cybercrime) గురించి, బాలకార్మికుల నిషేదిత చట్టం(Child Labour Prohibition Act) గురించి, ఉచిత విద్యా నిర్భంద హక్కు చట్టం గురించి వివరించారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మంచిగా చదువు కొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఉచిత న్యాయం ఎలా పొందాలో అవగాహన కల్పించడం జరిగింది.
విద్యార్థులకు అందుతున్నటువంటి బోజన సౌకర్యాలు వసతులు, అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ కె.జి.బి.వి.స్పెషల్ ఆఫీసర్ జిజెవి లక్మీ , సీఆర్టీ టీచర్స్ చందనదేవి, అనిత, అంబిక, జీవిత, ప్రతిభ, ఉమాదేవి, ఏఎన్ఎం రమణమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.